ముంబై క్రికెటర్‌ అబ్బురపరిచే బ్యాటింగ్‌ విన్యాసం.. ఏకధాటిగా 72 గంటల పాటు..!

Mumbai Teen Siddharth Mohite Batted For 72 Hours, Waiting For Guinness Record - Sakshi

ముంబై: ముంబై యువ క్రికెటర్‌ సిద్దార్థ్‌ మోహితే అబ్బురపరిచే బ్యాటింగ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఏకధాటిగా 72 గంటల ఐదు నిమిషాల పాటు నెట్స్‌లో బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2015లో విరాగ్‌ మానే అనే క్రికెటర్‌ 50 గంటల పాటు నెట్స్‌లో బ్యాటింగ్‌ చేయగా, తాజాగా సిద్దార్థ్‌.. సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయడంలో విరాగ్‌ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. 

తనలో ఎక్స్‌ట్రా టాలెంట్‌ ఉందిన ప్రపంచానికి తెలియజేయడానికే ఈ ప్రదర్శనను చేసినట్లు మోహితే చెప్పుకొచ్చాడు. మోహితే ఈ ఫీట్‌ సాధించడంలో రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ పర్సనల్‌ కోచ్‌ జ్వాలా సింగ్‌ కీలకంగా వ్యవహరించాడు. మోహితే ఈ రికార్డు సాధించడం కోసం జ్వాలా సింగ్‌ను మెంటార్‌గా నియమించుకున్నాడు.
చదవండి: IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top