గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని..

MS Dhoni Displays Fitness While Racing With Shetland Pony Became Viral - Sakshi

రాంచీ: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని తన పోనిటేల్‌ గుర్రంతో పోటీపడి మరి పరుగులు తీశాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో ధోని రాంచీకి చేరుకొని తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్న స్కాటిష్‌ బ్రిటీష్‌ గుర్రం అయిన షెట్‌లాండ్‌ పోనితో సరదాగా ఆడుకున్నాడు. అది పరుగులు తీస్తుంటే.. ధోని కూడా దాని వెనకాలే పరిగెత్తుతూ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అయితే గుర్రంతో పోటీపడి పరుగులు తీయలేక ఒక దశలో వెనుకపడ్డాడు. అయితే 35 ఏళ్లు వచ్చిన తనలో ఫిట్‌నెస్‌ మాత్రం తగ్గలేదని ధోని చూపించాడు.దీనికి సంబంధించిన వీడియోనూ సాక్షి ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. '' స్ట్రాంగర్‌ దెన్‌ ఫాస్టర్‌.. ఇట్స్‌ ప్లే టైమ్‌ విత్‌ షెట్‌లాండ్‌ పోనీటేల్‌'' అంటూ క్యాప్షన్‌ జతచేసింది. 

ఇక ధోని సారధ్యంలోని సీఎస్‌కే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దుమ్మురేపింది. యూఏఈ వేదికగా జరిగిన గత ఐపీఎల్‌ సీజన్‌ను మరిపిస్తూ సీఎస్‌కే ప్రదర్శన కొనసాగింది. సీఎస్‌కే తాను ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 2 ఓటములతో 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కరోనా మహమ్మారితో వాయిదా పడిన లీగ్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. 
చదవండి: శతక్కొట్టిన పంత్‌.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top