సిరాజ్‌ సూపర్‌ డెలివరీ.. బాబర్‌ ఆజం ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

ODI WC 2023: సిరాజ్‌ సూపర్‌ డెలివరీ.. బాబర్‌ ఆజం ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published Sat, Oct 14 2023 5:08 PM

Mohammed Siraj Castles Babar Azam With Brilliant Delivery - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.  రెండో వికెట్‌ కోల్పోయిన తర్వాత సీనియర్‌ ఆటగాళ్లు రిజ్వాన్‌, బాబర్‌ పాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 

భారత స్పిన్నర్లపై వీరిద్దరూ అధిపత్యం చెలాయిస్తూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సిరాజ్‌ చేతికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బంతిని అందించాడు. రోహిత్‌ నమ్మకాన్ని సిరాజ్‌ వమ్ముచేయలేదు. పాక్‌ ఇన్నింగ్స్‌ 30 ఓవర్‌లో సిరాజ్‌ నాలుగో బంతిని గుడ్‌లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. 

ఆ బంతిని బాబర్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బాబర్‌ బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.  కాగా ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ను కూడా సిరాజే సాధించాడు. అబ్దుల్లా షఫీక్‌ను ఎల్బీగా సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు.
చదవండి: World Cup 2023: న్యూజిలాండ్‌కు బిగ్‌.. కేన్‌ మామ వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement