'ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను'

Meeting MS Dhoni was a dream come true says Shahnawaz Dahani - Sakshi

ఎంతో మంది యువ క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆదర్శ ప్రాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోని యువ ఆటగాళ్లకి జట్టుతో సంబంధం లేకుండా విలువైన సూచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ధోనిను కలవడంతో తన కల సాకరమైంది అని పాకిస్తాన్‌ యువ సంచలనం షానవాజ్ దహానీ తెలిపాడు. ధోని తనకు విలువైన సూచనలు చేశాడాని అతడు చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌-2021లో పాకిస్తాన్‌- భారత్‌ మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా మెంటార్‌గా వ్యవహరిస్తున్న ధోనిను దహానీ కలిశాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను కలవాలనే  కోరికను కూడా అతడు వెల్లడించాడు.  తంలో న్యూజిలాండ్ మాజీ స్పీడ్‌స్టర్ షేన్ బాండ్‌ని ఫాలో అయ్యేవాడిని అని, ప్రస్తుతం  ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ ఆర్చర్‌ను అనుసరిస్తున్నాని దహానీ పేర్కొన్నాడు. దహానీ ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ముల్తాన్‌ సూల్తాన్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో దహానీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ముల్తాన్‌ సుల్తాన్‌ ఫైనల్‌కు చేరడంలో దహానీ కీలక పాత్ర పోషించాడు. "నేను న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ షేన్‌ బాండ్‌ను ఫాలో అయ్యే వాడిని. అతడు లాగే ఫాస్ట్‌ బౌలర్‌ కావాలి అని అనుకున్నాను. కానీ అతడు రిటైర్మెంట్ తర్వాత, నేను ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ని అనుసరించడం ప్రారంభించాను.  త్వరలో ఆర్చర్‌ను  కలవాలనేది నా కోరిక. ఇక మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్ ధోనీ గరించి చెప్పాలంటే నాకు చాలా సమయం పడుతుంది. అతడిని కలవడం నా కల నెరవెరింది. ఇప్పటికి అతడిని కలిసిన ఆ క్షణం మర్చిపోలేను. ఎందుకంటే జీవితం గురించి, పెద్దలను గౌరవించడం గురించి ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఊపయోగపడ్డాయి. క్రికెట్‌లో మంచి, చెడు రోజులు వస్తాయని, వాటిని స్వీకరించాలని ధోని చెప్పాడు. అటువంటి సమయంలో కేవలం ఆటపై దృష్టి సారించాలి అని అతడు చెప్పాడు" అని దహానీ క్రికెట్‌ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

చదవండి: Emma Raducanu: వెంబడించి, వేధించాడు.. చాలా భయపడ్డా..! నిషేదాజ్ఞ జారీ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top