లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్‌ అప్‌డేట్‌ | Lungi Ngidi stable after head injury at Arun Jaitley Stadium | Sakshi
Sakshi News home page

IPL 2026: లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్‌ అప్‌డేట్‌

Apr 25 2026 8:44 PM | Updated on Apr 26 2026 11:38 AM

Lungi Ngidi stable after head injury at Arun Jaitley Stadium

ఐపీఎల్‌-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తలకు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అత‌డిని వెంట‌నే అంబులెన్స్‌లో పూసా రోడ్డులోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. 

అయితే తాజాగా అత‌డి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎంగిడీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కానున్న‌ట్లు ఢిల్లీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, ఆర్‌సీబీ వంటి ఫ్రాంచైజీలు కూడా ఎంగిడీ త్వ‌రంగా కోలుకోవాల‌ని పోస్ట్‌లు పెట్టారు.

అస‌లేమి జ‌రిగిందంటే?
ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అక్షర్ పటేల్ వేసిన మూడో బంతిని ప్రియాన్ష్‌ ఆర్య మిడాఫ్‌ భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతికి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న ఎంగిడీ బంతిని అందుకునేందుకు వెనుకకు పరిగెత్తాడు. బంతిని అందుకు క్ర‌మంలో ఎంగిడీ బ్యాలెన్స్ కోల్పోయి కింద‌ప‌డిపోయాడు. 

ఈ క్ర‌మంలో అత‌డి త‌ల వెనుక భాగం మైదానంకు బ‌లంగా తాకింది. మెడ నొప్పి, తీవ్రమైన తలనొప్పితో బాధ‌ప‌డ్డాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి అతడికి ఏ మాత్రం రీలీఫ్ రాలేదు. దీంతో మైదానం నుంచి నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల్సి వ‌చ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓట‌మి పాలైంది. పంజాబ్ రికార్డు ఛేజింగ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement