
Lionel Messi Shocking Video.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మైదానంలా పాదరసంలా కదులడం చూస్తుంటాం. కానీ లీగ్ 1లో భాగంగా పీఎస్‌జీ, లిల్లే మధ్య జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కొన్ని సెకన్ల పాటు ఇంచు కూడా కదలకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిమిషంలో హాఫ్ టైమ్ ముగుస్తుందనగా.. నెయమర్, అంజెల్ డీ మారియాలు గోల్ కోసం ప్రయత్నిస్తుంటే ఇతర ఆటగాళ్లు అడ్డుకోవడం కోసం పరిగెత్తారు. కానీ మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న మెస్సీ మాత్రం కొన్ని సెకన్లపాటు కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలో అది స్పష్టంగా కనిపించింది.
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రిస్టియానో రొనాల్డొ..
కాగా మెస్సీకి మోకాలి గాయం తిరగబెట్టడంతో అలా చేశాడని మ్యాచ్ అనంతరం పీఎస్‌జీ వివరించింది. ఇక మెస్సీని ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని.. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తప్ప తర్వాతి గేమ్‌కు అందుబాటులో ఉంటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పీఎస్‌జీ లిల్లేపై 2-1 తేడాతో గెలిచింది. పీఎస్‌జీ తరపున మారిక్వినోస్, ఎంజెల్ డి మారియాలు ఆట 74, 88వ నిమిషంలో గోల్ కొట్టారు.
Lionel Messi mannequin challenge 2k21🔥🔥🔥 pic.twitter.com/KoK2bCLIQj
— J📌 (@jugga75490069) October 31, 2021