'ధోనిని మిస్సవుతున్నా.. ఇప్పుడు పంత్‌ కనిపిస్తున్నాడు'

Kuldeep Yadav Says Missing MS Dhoni Giving Ideas I Found Rishab Pant - Sakshi

ఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ సలహాలు, సూచనల్ని మిస్ అవుతున్నట్లు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఈ మధ్యకాలంలో సరైన ఫామ్‌ లేక సతమతమవుతున్న కుల్దీప్‌ ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన పరిమిత ఓవర్లు ఆటలో దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ దెబ్బతో కుల్దీప్‌కు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.

తాజాగా కుల్దీప్‌ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపిక కాలేకపోయాడు. ధోని ఉన్న సమయంలో కుల్దీప్‌ను బాగా ప్రోత్సహించాడు. వికెట్ల వెనుక నుంచి కుల్దీప్ యాదవ్‌కి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. దాంతో.. కెరీర్ ఆరంభంలో అంచనాలకి మించి రాణించిన కుల్దీప్ యాదవ్.. మూడు ఫార్మాట్లలోనూ ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా ఎదిగాడు. కానీ.. ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతని కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే కుల్దీప్‌ ధోని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''  ధోనీ భయ్యా సలహాల్ని చాలా మిస్సవుతున్నా. అతను తన అనుభవంతో వికెట్ల వెనుక నుంచి నాకు విలువైన సలహాల్ని ఇచ్చేవాడు. అలానే క్లిష్ట పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేసేవాడు. ప్రస్తుతం వికెట్ల వెనుక రిషబ్‌ పంత్ ఉన్నాడు. కానీ.. అతను సలహాలు ఇవ్వాలంటే మరికాస్త అనుభవం కావాలి. ప్రతి బౌలర్‌కీ ధోనీ లాంటి ఆటగాడి అవసరం అవసరం’’ అని కుల్దీప్ యాదవ్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
చదవండి: 
నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాద‌వ్‌

కరోనాతో మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి కన్నుమూత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top