కేఎల్‌ రాహుల్‌, అతియ శెట్టిల వివాహానికి ముహూర్తం ఫిక్స్‌.. పెళ్లి ఎప్పుడంటే..?

KL Rahul, Athiya Shetty To Get Married On Jan 23 - Sakshi

క్రికెట్‌, సినీ ఫాలోవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల (జనవరి) 23న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఖండాలాలోని అతియ తండ్రి సునీల్ శెట్టి నివాసం ఈ వివాహానికి వేదిక కానుంది.

క్రికెట్‌, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివాహ వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుం‍డా సాదాసీదాగా జరుగుతాయని అతియ తండ్రి సునీల్‌ శెట్టి తెలిపారు.

సినీ రంగం నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్.. క్రికెట్ రంగం నుంచి ధోని, విరాట్ కోహ్లి తదితరులు వివాహ వేడుకకు హాజరవుతారని ఓ ప్రముఖ దిన పత్రిక వెల్లడించింది. కాగా, కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బిజీగా ఉండగా.. అతియ మాత్రం వివాహా ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top