విజేత జ్యోతి సురేఖ | Jyothi Surekha Vennam wins 2022 Lancaster Archery | Sakshi
Sakshi News home page

విజేత జ్యోతి సురేఖ

Feb 1 2022 6:21 AM | Updated on Feb 1 2022 6:21 AM

Jyothi Surekha Vennam wins 2022 Lancaster Archery - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాన్‌కాస్టర్‌ క్లాసిక్‌ అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల ఓపెన్‌ ప్రొ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో పోటీపడింది. జాతీయ పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించే సురేఖ ఫైనల్లో 131–129 పాయింట్ల తేడాతో పేజ్‌ పియర్స్‌ (అమెరికా)పై విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. విజయవాడకు చెందిన సురేఖ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 660 పాయింట్లకుగాను 653 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement