
వంద మైళ్ల వేగంతో బంతి విసరకపోవచ్చు గానీ విజయ్ శంకర్ క్రికెట్ ప్రపంచంలో అందరికీ మీడియం పేసర్‌గానే తెలుసు. ఇదే అర్హతతో అతను ప్రపంచ కప్ కూడా ఆడాడు. కానీ ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ మాత్రం అతడిని మరోలా భావిస్తోంది. జట్ల వివరాలు ఉన్న పేజీలో విజయ్ శంకర్‌ను ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా చూపిస్తుండటం విశేషం. సన్‌రైజర్స్ తరఫున ఇప్పటికే మూడు సీజన్లు బరిలోకి దిగిన అతని వివరాలు మాత్రం ఇప్పటికీ తప్పుగా ఉండటం ఆశ్చర్యకరం. భారత్ తరపున విజయ్ శంకర్ 12 వన్డేలు, 9 టి20 మ్యాచ్‌లు ఆడాడు.