రాజస్తాన్‌పై సన్‌రైజర్స్‌ విజయం | IPL 2026: Sunrisers hyderabad vs Rajasthan royals live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: రాజస్తాన్‌పై సన్‌రైజర్స్‌ విజయం

Apr 25 2026 7:06 PM | Updated on Apr 25 2026 11:49 PM

IPL 2026: Sunrisers hyderabad vs Rajasthan royals live updates

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. 

ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్‌ జురేల్‌ (51) అర్థసెంచరీతో రాణించాడు.

16 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 193/3
రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయానికి చేరువలో ఉంది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. నితీశ్‌కుమార్‌ 21, క్లాసెన్‌ 18 పరుగులతో ఆడుతున్నారు.

6 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (34), ఇషాన్‌ కిషన్‌ (35) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌
7 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన హెడ్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 38/1. క్రీజులో ఇషాన్‌ కిషన్‌(35), అభిషేక్‌ శర్మ(4) ఉన్నారు.

వైభవ్‌ సూపర్‌ సెంచరీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు భారీ టార్గెట్‌
జైపూర్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్తాన్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103) సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పాటు ధ్రువ్‌ జురెల్‌(51), ఫెరీరా(33) రాణించారు.

వైభవ్‌ సూర్యవంశీ సెంచరీ
వైభవ్‌ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.

రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
152 పరుగుల వద్ద రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 51 పరుగులు చేసిన ధ్రువ్‌ జురెల్‌.. నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 153/2

100 దాటిన రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్‌ 
రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్‌ 100 దాటింది. 9 ఓవర్ల నాటికి 104/1 స్కోరు చేసింది. 

వైభవ్‌ సూర్యవంశీ హాఫ్‌ సెంచరీ
15 బంతుల్లో వైభవ్‌ సూర్యవంశీ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
36 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన యశశ్వి జైశ్వాల్‌.. ఎషాన్‌ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 63/1

వైభవ్‌ సూర్యవంశీ దూకుడు
రాజస్తాన్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రపుల్‌ హింగే వేసిన తొలి ఓవర్‌లో వైభవ్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు.  ఆ తర్వాత కమ్మిన్స్‌ బౌలింగ్‌లో వైభవ్‌ భారీ సిక్సర్‌ బాదాడు. 2 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 36/0

బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌
ఐపీఎల్‌-2026లో జైపూర్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ తిరిగొచ్చాడు.

కమ్మిన్స్‌ తిరిగి రావడంతో ఇషాన్‌ కిషన్‌ కేవలం ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. దిల్షాన్‌ మధుశంక స్ధానంలో కమ్మిన్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జ‌ట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీప‌ర్‌), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement