IPL 2022: Mumbai Indians Creates Worst Record After 7 Consecutive Matches Failure In IPL - Sakshi
Sakshi News home page

IPL 2022 Mumbai Indians: ముంబై ఇండియన్స్‌ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి జట్టుగా..

Apr 22 2022 8:03 AM | Updated on Apr 22 2022 11:23 AM

IPL 2022: Mumbai Indians Worst Record In IPL First 7 Matches 7 Defeats - Sakshi

ముంబై ఇం‍డియన్స్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL CSK Vs MI- Mumbai Indians Worst Record: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే వరుసగా తొలి ఏడు మ్యాచ్‌లు ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. ఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమితో ఈ అపఖ్యాతి మూటగట్టుకుంది. 

కాగా తాజా ఎడిషన్‌లో మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన రోహిత్‌ సేన 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌.. తాజాగా సీఎస్‌కే చేతిలో ఓడిపోయింది.

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆరంభ ఏడు మ్యాచ్‌లు ఓడిన తొలి జట్టుగా ముంబై అపవాదును మూటగట్టుకుంది.  అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 2013లో, ఆర్సీబీ 2019లో సీజన్‌ ఆరంభంలో మొదటి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైన జట్లుగా పేరొందాయి. ఇక ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన గురువారం నాటి(ఏప్రిల్‌ 21) మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్‌ ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు విజయం అందించాడు. దీంతో ముంబైకి మరోసారి పరాభవం తప్పలేదు. మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌ స్కోర్లు:
ముంబై- 155/7 (20)
చెన్నై- 156/7 (20) 

చదవండి: IPL 2022: ధోని ఫినిషింగ్‌ టచ్‌.. ముంబై ‘ఏడు’పు..!

Advertisement
 
Advertisement
Advertisement