IPL 2022-CSK: ఒక్క ఆటగాడు గాయపడితే.. ఇంత చెత్తగా ఆడతారా? ఆఖరి మ్యాచ్‌లోనూ..

IPL 2022: Aakash Chopra on CSK Season Should Not This Bad 1 Player Injured - Sakshi

IPL 2022- CSK Failure: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్‌-2022 సీజన్‌ అస్సలు కలిసిరాలేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకుంది. పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. తొలుత రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించడం.. వరుస పరాజయాలు.. ఆ తర్వాత మళ్లీ ధోనికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వంటి నిర్ణయాలు ఆ జట్టులోని గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టాయి.

ఎన్నో అంచనాలతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్‌ చహర్‌ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం కూడా ప్రభావం చూపింది. అయితే, ఒకరిద్దరు మినహా మిగతావాళ్లంతా దాదాపుగా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్నా సరే పరాజయాల పరంపర కొనసాగింది. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ ఓటమి పాలై సీజన్‌ను చేదు అనుభవంతో ముగించింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌ ఆకాశ్‌ చోప్రా.. ఈ ఎడిషన్‌లో సీఎస్‌కే ప్రయాణాన్ని, చివరి మ్యాచ్‌ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘చెన్నైకి ఇంతకంటే చెత్త సీజన్‌ మరొకటి లేదు. ఈసారి వాళ్లు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదు. తమ మార్కును అస్సలు చూపించలేకపోయారు.

దీపక్‌ చహర్‌ ఒక్కడే గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. కానీ ఒక్క ప్లేయర్‌ లేనంత మాత్రాన మరీ ఇంత ఘోరంగా విఫలమవడం వారి స్థాయికి తగదు’’ అని యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఘాటు విమర్శలు చేశాడు. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఈ మ్యాచ్‌ ముఖ్యంగా సీఎస్‌కే ఇన్నింగ్స్‌ చాలా ఆసక్తికరంగా సాగింది.

మొదట టీ10, తర్వాత వన్డే.. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ను తలపించింది. మొదటి ఆరు ఓవర్లలో టీ10 మాదిరి.. మొయిన్‌ అలీ అదరగొట్టాడు. అయితే డెవాన్‌ కాన్వే అవుటైన తర్వాత 50-50 మ్యాచ్‌ను గుర్తు చేసింది. ఇక జగదీశన్‌, అంబటి రాయుడు అవుటైన తర్వాత టెస్టు క్రికెట్‌. ధోని 28 బంతుల్లో 26 పరుగులు చేయడం చూశాం కదా!’’ అంటూ ఆకాశ్‌ చోప్రా పెదవి విరిచాడు. 

చదవండి👉🏾Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్‌, చహల్‌కు చోటు! బ్యాకప్‌ ప్లేయర్‌గా త్రిపాఠి
చదవండి👉🏾Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్‌ కప్‌ కొట్టబోతుంది..'

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top