ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..! | Sakshi
Sakshi News home page

ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!

Published Fri, May 24 2024 2:03 PM

India's Preethishmita Wins Gold Medal At World Youth Weightlifting Championship

లిమా (పెరూ): ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్‌ మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు (క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 76 కేజీలు+స్నాచ్‌లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో (క్లీన్‌ అండ్‌ జెర్క్‌+స్నాచ్‌+టోటల్‌) వేర్వేరుగా పతకాలు అందించగా... ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.

40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్‌ జోష్నా సబర్‌ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్‌ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్‌ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.

ఇవి చదవండి: జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement