తొలి విజయం కోసం భారత్‌ నిరీక్షణ... నేడు దక్షిణాఫ్రికాతో నాలుగో టి20 | Indian womens cricket team Fourth T20 against South Africa today | Sakshi
Sakshi News home page

తొలి విజయం కోసం భారత్‌ నిరీక్షణ... నేడు దక్షిణాఫ్రికాతో నాలుగో టి20

Apr 25 2026 3:16 AM | Updated on Apr 25 2026 3:16 AM

Indian womens cricket team Fourth T20 against South Africa today

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇప్పటికే 0–3తో సిరీస్‌ కోల్పోయిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... శనివారం సఫారీలతో నాలుగో మ్యాచ్‌ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

త్వరలో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌తో జట్టు కూర్పు సరిచూసుకోవాలనుకున్న టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. షఫాలీ వర్మ, కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫర్వాలేదనిపిస్తుండగా... స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ రాణించాల్సిన అవసరముంది. మరోవైపు ఇప్పటికే సిరీస్‌ పట్టేసిన సఫారీలు ఇక ‘క్లీన్‌స్వీప్‌’పై కన్నేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement