న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌.. ముంబైకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌ | Indian Players Arrive In Mumbai For World Cup 2023 Semi Finals | Sakshi
Sakshi News home page

World Cup 2023: న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌.. ముంబైకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌

Nov 13 2023 6:35 PM | Updated on Nov 13 2023 7:23 PM

Indian Players Arrive In Mumbai For World Cup 2023 Semi Finals - Sakshi

వన్డేప్రపంచకప్‌-2023 లీగ్‌ దశను అద్బుత విజయంతో ముగించిన టీమిండియా.. ఇప్పుడు సెమీఫైనల్‌లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి సెమీఫైనల్లో నవంబర్‌ 15న ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ క్రమంలో సోమవారం(నవంబర్‌ 13) సాయంత్రం ముంబైలో భారత జట్టు అడుగుపెట్టింది.

నేరుగా బెంగళూరు నుంచి రోహిత్‌ సేన ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవతున్నాయి. కాగా భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మాత్రం జట్టుతో కాకుండా తన ఫ్యామిలీతో ముంబైకు చేరుకున్నాడు.

ఇక ముంబైకు చేరుకున్న భారత జట్టు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గోనుంది. కాగా ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: World cup 2023: కివీస్‌తో సెమీస్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement