కాంస్య పతక పోరులో ఓటమి  | Indian Archery Team Lose Bronze Medal Match Vs Brazil | Sakshi
Sakshi News home page

కాంస్య పతక పోరులో ఓటమి 

Jun 23 2022 7:31 AM | Updated on Jun 23 2022 7:46 AM

Indian Archery Team Lose Bronze Medal Match Vs Brazil - Sakshi

పారిస్‌: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీలో భారత మహిళల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతక పోరులో ఓడిపోయింది. వెన్నం జ్యోతి సురేఖ, ప్రియా గుర్జర్, ముస్కాన్‌ కిరార్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 228–231తో సోఫీ డోడిమోంట్, లోలా గ్రాండ్‌జీన్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్‌ జట్టు చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు ‘బై’ పొందిన భారత్‌ 230–227తో బ్రెజిల్‌ జట్టును ఓడించి సెమీఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో భారత్‌ 228–231తో బ్రిటన్‌ జట్టు చేతిలో పరాజయంపాలై కాంస్య పతకం బరిలో నిలిచింది. అభిషేక్‌ వర్మ, మోహన్‌ రామ్‌స్వరూప్‌ భరద్వాజ్, అమన్‌ సైనీలతో కూడిన భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో 234–235తో టర్కీ చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement