
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న సెకెండ్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో అదరగొట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.
భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ (177) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(129) శతక్కొట్టాడు. వీరిద్దరితో పాటు ధ్రువ్ జురెల్ (44), నితీశ్ రెడ్డి (43), సాయిసుదర్శన్(87) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు తీయగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
జడేజా మ్యాజిక్..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరేబియన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ ఇంకా భారత్ కంటే 378 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో టెవిన్ ఇమ్లాచ్(14), షాయ్ హోప్(31) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.
చదవండి: IND vs WI: శుబ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్