Ind Vs Ban: దెబ్బ కొట్టిన స్పిన్నర్లు; మెరిసిన పంత్‌, అయ్యర్‌.. భారత్‌ స్కోరు ఎంతంటే

Ind Vs Ban 2nd Test Day Highlights Pant Iyer Shines India 314 All Out - Sakshi

Ind vs Ban- 2nd Test- Day 2- Rishabh Pant- Shreyas Iyer: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ప్రదర్శనతో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 80 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మిడిలార్డర్‌ బ్యాటర్లు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. టాపార్డర్‌ చేతులెత్తేసిన వేళ పంత్‌, అయ్యర్‌ తమ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు.

ఆదిలోనే వికెట్లు.. దెబ్బకొట్టిన తైజుల్‌
19 పరుగుల వద్ద రెండో రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాను ఆదిలోనే దెబ్బకొట్టాడు బంగ్లా స్పిన్నర్‌ తైజుల్‌ అస్లాం. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(10) సహా మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(20)ను ఎల్బీడబ్ల్యూ చేసి భారత్‌కు షాకిచ్చాడు. తర్వాత పుజారా(24) వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రిషభ్‌ పంత్‌.. విరాట్‌ కోహ్లికి సహకారం అందించాడు. అయితే, మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లి 24 పరుగుల వద్ద నిష్క్రమించాడు. దీంతో పంత్‌పై బాధ్యత పెరిగింది.

పంత్‌, అయ్యర్‌ అర్ధ శతకాలు
అందుకు తగ్గట్టుగానే మరో ఎండ్‌ నుంచి సహకారం అందడంతో పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. సెంచరీ చేజారినప్పటికీ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ 105 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టీమిండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. అయ్యర్‌ సహా అక్షర్‌ పటేల్‌(4), అశ్విన్‌(12),  సిరాజ్‌ (7 ) వికెట్లను బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

స్పిన్నర్లు హిట్‌
ఉమేశ్‌ యాదవ్‌(14)ను తైజుల్‌ అస్లాం పెవిలియన్‌కు పంపగా.. ఉనాద్కట్‌ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 314 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై షకీబ్‌, తైజుల్‌ నాలుగేసి వికెట్లు తీయగా.. పేసర్‌ టస్కిన్‌ అహ్మద్‌ 1, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 

ఇక మిర్పూర్‌ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్‌ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 80 పరుగుల ఆధిక్యం లభించింది.

చదవండి: Ben Stokes: చెన్నై తదుపరి కెప్టెన్‌గా స్టోక్స్‌!? ఏకంగా 16 కోట్లకు..! ఛాన్స్‌ మిస్‌ చేశారంటున్న ఆరెంజ్‌ ఆర్మీ!
Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్‌ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top