Ben Stokes: చెన్నై తదుపరి కెప్టెన్‌గా స్టోక్స్‌!? ఏకంగా 16 కోట్లకు..! ఛాన్స్‌ మిస్‌ చేశారంటున్న ఆరెంజ్‌ ఆర్మీ!

IPL Auction CSK Buy Stokes 16 Crore Can New Thala Bad For SRH - Sakshi

IPL 2023 Auction- Ben Stokes- Chennai Super Kings: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను సొంతం చేసుకోవాలన్న ఫ్రాంఛైజీల ఆశలపై నీళ్లు చల్లింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. టెస్టు జట్టు కెప్టెన్‌ కోసం నెలకొన్న తీవ్రమైన పోటీలో భారీ ధర వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ఏకంగా 16.25 కోట్ల రూపాయలకు స్టోక్స్‌ను కొనుగోలు చేసింది.

కాగా ఈ స్టార్‌ ప్లేయర్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీపడ్డాయి. అయితే, స్టోక్స్‌ను వదులుకోవడానికి ఇష్టపడని సీఎస్‌కే అతడి కోసం ఈ మేరకు భారీ మొత్తం ఖర్చు చేసింది.

ఛాన్స్‌ మిస్‌ చేశారు..
ఇక స్టోక్స్‌ను చెన్నై ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడంతో సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ ఉసూరుమన్నారు. ఈ మేటి ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేస్తే కెప్టెన్‌గా కూడా ఉపయోగపడే వాడు కదా అంటూ తమకు తోచినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ మరోసారి వేలంలో పొరపాటు చేసిందని అభిప్రాయపడుతున్నారు.

వాళ్ల కోసం భారీగా
అయితే, పర్సులో అత్యధికంగా 42.25 కోట్లు కలిగి ఉన్న సన్‌రైజర్స్‌ హ్యారీ బ్రూక్‌(13.25 కోట్లు), మయాంక్‌ అగర్వాల్‌(8.25 కోట్లు) కోసం భారీగా ఖర్చు చేయడంతో స్టోక్స్‌ విషయంలో వెనకడుగు వేసింది.  

కెప్టెన్‌గా స్టోక్స్‌
ఇక గతంలో చెన్నైకి ఆడిన స్టోక్స్‌ తిరిగి రావడం వెనుక తలా ధోని హస్తం ఉందనడంలో సందేహం లేదు. స్టోక్స్‌ రాకతో కొత్త కెప్టెన్‌ దొరికిసేనట్లేనని అభిమానులు సంబరపడుతున్నారు. ధోని ఇక గుండె మీద చేయి వేసుకుని రిలాక్స్‌ అవ్వొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా గత సీజన్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను సారథిగా నియమించగా విఫలమైన నేపథ్యంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్‌-2019, టీ20 ప్రపంచకప్‌-2022 ట్రోఫీలను ఇంగ్లండ్‌ గెలవడంలో స్టోక్స్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్‌ అయినప్పటికీ దూకుడైన ఆటతో సంప్రదాయ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తూ విజయాలు అందుకున్నాడు. ఇప్పటి వరకు అతడి కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ పదింట తొమ్మిది టెస్టులు గెలవడమే ఇందుకు నిదర్శనం.  

చదవండి: Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్‌ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే..
Ind Vs Ban: అయ్యో పంత్‌.. సెంచరీ మిస్‌! అయితేనేం ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు! సాహా తర్వాత..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top