జడేజాను భయపెట్టిన ధోని.. వైరల్ | MS Dhoni Scared Ravindra Jadeja Video viral | Sakshi
Sakshi News home page

జడేజాను భయపెట్టిన ధోని.. వైరల్

May 13 2018 7:21 PM | Updated on May 13 2018 7:41 PM

MS Dhoni Scared Ravindra Jadeja Video viral - Sakshi

జడేజాను భయపెడుతున్న ధోని

సాక్షి, పుణే: ఐపీఎల్-11లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జట్టు ఆటగాడు రవీంద్ర జడేజాని చెన్నై కెప్టెన్ ధోని భయపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌ను హర్భజన్ సింగ్ వేయగా.. ఓవర్ చివరి బంతిని శిఖర్ ధావన్ షార్ట్ వికెట్ దిశగా ఆడాడు. బంతిని ఆపేందుకు ఫీల్డర్ జడేజా వస్తుండగా.. అంతకుముందుగానే కీపర్ ధోని బంతిని ఆపాడు. అప్పటికి సింగల్ పూర్తయింది. అయితే బంతిని అందుకున్న ధోని అనూహ్యంగా జడేజా వైపు విసురుతున్నట్లుగా చేశాడు. ధోని చర్యకు భయపడ్డ జడేజా.. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోగా ఆ వీడియోను ఐపీఎల్ సైట్‌లో పోస్ట్ చేశారు. ధోని నిజంగానే జడేజాను భయపెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement