హైదరాబాద్‌ ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ | Hyderabad Foot ball Clud and NorthEast United share spoils in goalless | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’

Feb 8 2021 6:31 AM | Updated on Feb 8 2021 6:31 AM

Hyderabad Foot ball Clud and NorthEast United share spoils in goalless - Sakshi

వాస్కో: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ 0–0తో ‘డ్రా’గా ముగించింది. 16 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ 23 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌ 2–1తో జంషెడ్‌పూర్‌ క్లబ్‌ను ఓడించి ఈ టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఈస్ట్‌ బెంగాల్‌ తరఫున స్టీన్‌మన్‌ (6వ ని.లో), పిలింగ్టన్‌ (68వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. జంషెడ్‌పూర్‌ జట్టుకు హార్ట్‌లే (83వ ని.లో) ఏకైక గోల్‌ సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై సిటీతో గోవా క్లబ్‌ ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement