రఫ్ఫాడించిన జో రూట్‌.. అయినా..!

Hundred League 2023: Joe Root Blasting Fifty Didnt Help Trent Rockets To Beat London Spirit - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా ట్రెంట్‌ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 12) జరిగిన మ్యాచ్‌లో లండన్‌ స్పిరిట్‌ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. జో రూట్‌ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ రాకెట్స్‌ను గెలిపించలేకపోయాడు. 

చెలరేగిన లారెన్స్‌..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లండన్‌ స్పిరిట్‌.. కెప్టెన్‌ డేనియల్‌ లారెన్స్‌ (49 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లారెన్స్‌తో పాటు జాక్‌ క్రాలే (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, సిక్స్‌), డారిల్‌ మిచెల్‌ (17 బంతుల్లో 21 నాటౌట్‌; ఫోర్‌), రవి బొపారా (13 బంతుల్లో 25 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) రాణించారు. రాకెట్స్‌ బౌలర్లలో సామ్‌ కుక్‌, ఐష్‌ సోధి తలో 2 వికెట్లు పడగొట్టారు.

రూట్‌ పోరాటం వృధా..
196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్‌.. నిర్ణీత బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. విధ్వంసకర వీరులు రాకెట్స్‌ ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ (15), డేవిడ్‌ మలాన్‌ (1) స్వల్ప స్కోర్లకే ఔట్‌ కాగా.. రూట్‌ (35 బంతుల్లో 72 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు).. టామ్‌ కొహ్లెర్‌ (23 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్‌ మున్రో (15 బంతుల్లో 24; 3 ఫోర్లు), డేనియల్‌ సామ్స్‌ (11 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో రాకెట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. లండన్‌ బౌలర్లలో డేనియల్‌ వారెల్‌, లియామ్‌ డాసన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ ఎల్లిస్‌ ఓ వికెట్‌ తీశాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top