Highest Run Scorers In IPL 2022: ఐపీఎల్‌-2022లో టాప్‌ రన్‌ స్కోరర్స్ వీళ్లే..

Highest run scorer for each team IPL 2022 - Sakshi

ఐపీఎల్‌-2022 తుది దశకు చేరుకుంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో బౌలర్ల కంటే బ్యాటర్లు అదరగొట్టారు. యువ బ్యాటర్లు కూడా తమ సత్తా ఏంటో ఈ సీజన్‌లో చూపించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐపీఎల్‌-2022లో ప్రతీ జట్టు నుంచి అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్లపై ఓ లూక్కేద్దాం.

శుభమాన్ గిల్(గుజరాత్‌ టైటాన్స్‌)


ఈ ఏడాది సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్ తరపున శుభమాన్ గిల్ పర్వాలేదనిపించాడు. ఇప్పటి వరకు 14మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 403 పరుగులు సాదించి ఆ జట్టు తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

జోస్ బట్లర్(రాజస్తాన్‌ రాయల్స్‌)


జోస్ బట్లర్ ఐపీఎల్‌-2022లో దుమ్ము రేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు సాధించాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌.. 629 పరుగులు సాధించి రాజస్తాన్‌ తరపునే కాదు టోర్నీలోనే టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

కేఎల్‌ రాహుల్‌(లక్నో సూపర్‌ జెయింట్స్‌)


ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్ కెప్టెన్‌ రాహుల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ 537 పరుగులు సాధించి.. లక్నో జట్టులో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

ఫాఫ్ డు ప్లెసిస్(రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు)


ఆర్సీబీ నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన డు ప్లెసిస్.. జట్టకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన డు ప్లెసిస్ 443 పరుగులు సాధించి ఆర్‌సీబీ జట్టులో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

డేవిడ్ వార్నర్(ఢిల్లీ క్యాపిటల్స్‌)


ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 432 పరుగులు సాధించి ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.
శ్రేయస్ అయ్యర్(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌)


కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యర్ పర్వాలేదనిపించాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 401 పరుగులు సాధించి కేకేఆర్‌ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.

శిఖర్ ధావన్ (పంజాబ్‌ కింగ్స్‌)


ఈ ఏడాది సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ధావన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన ధావన్‌  421 పరుగులు సాధించి పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.

రాహుల్ త్రిపాఠి(సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌)


సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ తరపున త్రిపాఠి అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి 393 పరుగులు సాధించి ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

రుతురాజ్ గైక్వాడ్( చెన్నై సూపర్‌ కింగ్స్‌)


ఈ ఏడాది సీజన్‌ ఆరంభంలో రుతురాజ్ గైక్వాడ్ నిరాశపరిచనప్పటికీ.. ఆ తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్ 368 పరుగులు సాధించి సీఎస్‌కే తరపున టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

తిలక్‌ వర్మ(ముంబై ఇండియన్స్‌)


ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ నిరాశపరిచినప్పటికీ.. ఆ జట్టు బ్యాటర్‌ తిలక్‌ వర్మ మాత్రం అద్భుతంగా రాణించాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన తిలక్‌ వర్మ 397 పరుగులు సాధించి ముంబై తరపున టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

చదవండి: "నన్ను డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారు.." ప్రగల్భాలు పలికిన బంగ్లా వికెట్ కీపర్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top