జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌: హర్మిలన్‌ బైన్స్‌ ‘డబుల్‌’ | Harmilan Kaur Bains wins second gold medal of National Open Athletics | Sakshi
Sakshi News home page

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌: హరి్మలన్‌ బైన్స్‌ ‘డబుల్‌’

Sep 19 2021 5:45 AM | Updated on Sep 19 2021 5:45 AM

Harmilan Kaur Bains wins second gold medal of National Open Athletics - Sakshi

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో పంజాబ్‌కు చెందిన హర్మిలన్‌ కౌర్‌ బైన్స్‌ ‘డబుల్‌’ నమోదు చేసింది. ఇప్పటికే 1500 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన 23 ఏళ్ల హర్మిలన్‌ శనివారం జరిగిన 800 మీటర్ల విభాగంలోనూ పసిడి పతకం సొంతం చేసుకుంది. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో హర్మిలన్‌ 2ని:03.82 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. మహిళల ట్రిపుల్‌ జంప్‌లో బి.ఐశ్వర్య (రైల్వేస్‌) చాంపియన్‌గా నిలిచింది. లాంగ్‌జంప్‌లోనూ స్వర్ణం సాధించిన ఐశ్వర్య ట్రిపుల్‌ జంప్‌లో 13.55 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని సంపాదించింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ ఫైనల్‌ చేరాడు. పోటీల చివరిరోజు ఆదివారం 10 విభాగాల్లో ఫైనల్స్‌ జరుగుతాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement