ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

 Haris Rauf ruled out of last two Tests owing to an injury - Sakshi

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ హరీస్ రౌఫ్‌ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా రౌఫ్‌ రెడ్‌బాల్‌ క్రికెట్‌లో  అరంగేట్రం చేశాడు.

ఈ చారిత్రాత్మక టెస్టులో మొదటి రోజు ఫీల్డింగ్‌ చేస్తుండగా రౌఫ్‌ కుడి కాలికి గాయమైంది.అనంతరం అతడిని ఆసుపత్రికి తరిలించి స్కాన్‌ చేయించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతడికి దాదాపు నెల రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమచారం.

ఈ క్రమంలోనే హరీస్ మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక గాయపడిన రౌఫ్‌ స్థానంలో ఫహీమ్ అష్రఫ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు రౌఫ్‌ దూరం కావడం పాక్‌ను కలవరపెడుతోంది.

ఇక ఇది ఇలా  17  ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ ఓటమి చవిచూసింది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముల్తాన్‌ వేదికగా డిసెంబర్‌ 9 నుంచి జరగనుంది.
చదవండి: World Test Championship: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం! మరి టీమిండియా పరిస్థితి?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top