వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీకి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే టెస్టులకు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను కోరుకుంటుంది. కానీ ఈసారి మాత్రం ఫుల్ రాంక్ టర్నర్ పిచ్ వద్దని క్యూరేటర్‌కు గంభీర్ చెప్పాడంట. ఈ విషయాన్ని స్వయంగా మఖర్జీనే వెల్లడించాడు. టీమ్ మెనెజ్‌మెంట్ కొంచెం టర్న్ ఉండేలా పిచ్ తాయారు చేయమని సూచించినట్లు అతడు వెల్లడించాడు.
"తొలి టెస్టు కోసం మంచి పిచ్‌ను తాయారు చేశాము. బ్యాటర్లతోపాటు బౌలర్లకూ సహకారం లభిస్తుంది. ఆట సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ వికెట్‌పై బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రతీ హోమ్ టీమ్ కూడా పిచ్ విషయంలో కొన్ని సూచనలు చేస్తారు.
ఆస్ట్రేలియాలో అయితే ఆతిథ్య జట్టు ఎక్కువ బౌన్స్ ఉండే పిచ్‌లను తాయారు చేయమని అడుగుతారు. అదే భారత జట్టు అయితే టర్న్ ఉండేట్లు కోరుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం వారు ఫుల్ రాంక్ టర్నర్ పిచ్‌ను అడగలేదు. కొద్దిగా టర్న్ ఉండేలా తాయారు చేయమని చెప్పారు. అని మఖర్జీ ఇండియా టూడేతో పేర్కొన్నాడు.
కాగా మంగళవారం నాడు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ పిచ్‌ను పరిశీలించారు. ఈ వికెట్‌పై వారు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈడెన్ గార్డెన్స్ ఇటీవల రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్‌లలో పేసర్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?


