ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ హీరో సంచలన నిర్ణయం | England World Cup Winner Takes Drastic Step After Retiring From Cricket | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ హీరో సంచలన నిర్ణయం

Jun 27 2026 3:53 PM | Updated on Jun 27 2026 4:02 PM

England World Cup Winner Takes Drastic Step After Retiring From Cricket

ఇంగ్లండ్‌ వన్డే ప్రపంచకప్‌ విజేత (2019) లియామ్‌ ప్లంకెట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత మరో క్రీడలో కెరీర్ ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 41 ఏళ్ల ప్లంకెట్ అమెరికాలోని ఓక్‌ల్యాండ్ బాలర్స్ తరఫున ప్రొఫెషనల్ బేస్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. తద్వారా ప్రొఫెషనల్ బేస్‌బాల్ ఆడిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

2021లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ప్లంకెట్, అమెరికన్ మహిళను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో ఆటగాడిగా, కోచ్‌గా సేవలందించాడు.

తాజాగా పయనీర్ బేస్‌బాల్ లీగ్‌లోని ఓక్‌ల్యాండ్ బాలర్స్ జట్టు ప్రత్యేక "మార్కెటింగ్ ప్లేయర్" నిబంధన కింద ప్లంకెట్‌ను ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న అనుభవం కారణంగా బేస్‌బాల్‌లో పిచ్చర్ పాత్రకు అతడు సులభంగా అలవాటు పడ్డాడు.

2019 వరల్డ్‌కప్ హీరో
2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ప్లంకెట్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 89 వన్డేలు, 22 టీ20లు ఆడి 130కిపైగా వికెట్లు తీశాడు. 2019 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ వికెట్లు తీసి ఇంగ్లండ్ తొలి ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇతర క్రీడల్లోకి వెళ్లిన పలువురు క్రికెటర్లు
ఆండ్రూ ఫ్లింటాఫ్ – ప్రొఫెషనల్ బాక్సింగ్
నాథన్ ఆస్టిల్ – మోటార్ స్పోర్ట్స్
ఆడమ్ హోలియోక్ – మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA), బాక్సింగ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement