అదొక బోరింగ్‌ వికెట్‌.. బేసిక్స్‌ వికెట్‌: ఏబీ

De Villiers Says Terrible Feeling To Lose 3 Matches In Row - Sakshi

షార్జా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌ ఆశలు కాస్త క్లిష్టంగా మారిపోయాయి. ముందుగానే ప్లేఆఫ్స్‌కు చేరుతుందని భావించినా కడవరకూ ఎదురుచూడాల్సి పరిస్థితి వచ్చింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఏబీ డివిలియర్స్‌ మాట్లాడుతూ.. ‘వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి నిరాశను కల్గించింది. అదొక భయంకరమైన అనుభూతి. ఇలా జరుగుతుందని అనుకోలేదు.

కానీ ఈ టోర్నమెంట్‌ తీరే అలా ఉంటుంది.ఇక్కడ ఏమైనా జరగొచ్చు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవచ్చు..వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవొచ్చు. ఏది ఏమైనా ముందంజ వేయడంపైనే మేము దృష్టి కేంద్రీకరించాం. షార్జా వికెట్‌ చాలా స్లోగా ఉంది. అవుట్‌ ఫీల్డ్‌ ఇంకా నెమ్మదిగా ఉంది. దాంతో బౌండరీలు సాధించడం కష్టంగా మారింది. కేవలం ఒకటి, రెండు పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మాపై ఒత్తిడి పెంచింది. షార్జా వికెట్‌ ఏదైతే ఉందో అది చాలా బోరింగ్‌ ఉంది. ఇదొక బేసిక్స్‌ నేర్చుకుని వికెట్‌’ అని అని అభిప్రాయపడ్డాడు. (సన్‌రైజర్స్‌ గెలిచి నిలిచింది..)

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను ఆరెంజ్‌ ఆర్మీ 14.1 ఓవర్లలో  ఐదు  వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో ప్లేఆఫ్‌ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. వృద్ధిమాన్‌ సాహా( 39; 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో పాటు మనీష్‌ పాండే(26; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హోల్డర్‌(26 నాటౌట్‌; 10 బంతుల్లో  1 ఫోర్‌, 3 సిక్స్‌లు) ఆకట్టుకోవడంతో  సన్‌రైజర్స్‌ సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top