ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎంగిడీ తలకు బలమైన గాయమైంది. పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య.. మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు.
అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో మిడాఫ్‌లో ఉన్న ఎంగిడీ వెనుకకు వెళ్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి అతడు వెల్లకిలా పడిపోయాడు. తల వెనుక భాగం మైదానంకు బలంగా తాకింది.
దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ కదలకుండా అలా ఉండిపోయాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ గాయం తీవ్రమైనది కావడంతో మైదానంలోకి అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఎంగిడి మెడకు కూడా తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.
దీంతో అతడు మెడకు 'నెక్ బ్రేస్' అమర్చి జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మైదానం మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఎంగిడీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱
It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB— Sonu (@Cricket_live247) April 25, 2026


