కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ | IPL 2026 DC Vs PBKS, KL Rahul Smashes Sixth IPL Century, Check Out Highlights Inside | Sakshi
Sakshi News home page

IPL 2026 DC Vs PBKS: కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ

Apr 25 2026 4:55 PM | Updated on Apr 25 2026 5:33 PM

DC vs PBKS IPL 2026: KL Rahul smashes sixth IPL ton

ఐపీఎల్‌-2026లో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ శ‌త‌క్కొట్టాడు. 12 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న రాహుల్‌.. ఆ త‌ర్వాత ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

అత‌డు బ్యాటింగ్ ధాటికి బౌండ‌రీలు చిన్న‌బోయాయి. ఈ క్ర‌మంలో  రాహుల్ కేవ‌లం 47 బంతుల్లోనే త‌న ఆరువ ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  రాహుల్‌కు తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా కేవలం 67 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్‌.. 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

రాహుల్‌కు ఇదే ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్‌తో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది.


 

 

Advertisement
 
Advertisement
Advertisement