CWC 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌ | ODI World Cup 2023, New Zealand Vs Netherlands: Netherlands Won The Toss And Opted To Bowl First - Sakshi
Sakshi News home page

CWC 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌

Oct 9 2023 1:59 PM | Updated on Oct 9 2023 2:33 PM

CWC 2023 NZ VS NED: Netherlands Won The Toss And Opt To Bowl - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం న్యూజిలాండ్‌ ఓ మార్పు చేసింది. జేమ్స్‌ నీషమ్‌ స్థానంలో లోకీ ఫెర్గూసన్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు నెదర్లాండ్స్‌ ఈ మ్యాచ్‌ కోసం రెండు మార్పులు చేసింది. సైబ్రాండ్‌ ఏంజెల్‌బ్రెచ్‌, ర్యాన్‌ క్లెయిన్‌ జట్టులోకి వచ్చారు. కాగా, న్యూజిలాండ్‌ గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించగా.. నెదర్లాండ్స్‌ పాకిస్తాన్‌ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడ్‌, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్‌), సైబ్రాండ్‌ ఏంజెల్‌బ్రెచ్‌, ర్యాన్‌ క్లెయిన్‌, రోల్ఫ్‌ వాన్ డెర్ మెర్వ్‌, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement