
గుజరాత్ టైటాన్స్.. తమ ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-2022 టైటిల్‌ను హార్దిక్ పాండ్యా పాండ్యా సారథ్యంలోని గుజరాత్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీజన్‌లోనూ తమ జట్టును రన్నరప్‌గా హార్దిక్ నిలిపాడు.
కానీ అనుహ్యంగా ఐపీఎల్-2024కు ముందు ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ బాధ్యతలు చేపట్టనప్పటికి జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం పట్టిన గుజరాత్.. అంతకముందు సీజన్‌లో లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హార్దిక్ గుజరాత్‌ను వీడి రెండు సీజన్లు అవుతున్నప్పటి అతడి స్ధానాన్ని సరైన ఆటగాడు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. హార్దిక్ బ్యాట్, బంతితో రాణించి గుజరాత్ విజయాల్లో భాగమయ్యేవాడు. అయితే ఈసారి మినీవేలంలో అయినా హార్దిక్ తగ్గ ఆటగాడిని కొనుగోలు చేయాలని గుజరాత్ యాజమాన్యం భావిస్తుందంట.
గ్రీన్‌పై కన్ను..?
ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై గుజరాత్ టైటాన్స్ కన్నేసినట్లు తెలుస్తోంంది. గ్రీన్ గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న గ్రీన్ వచ్చే ఏడాది సీజన్‌లో ఆడనున్నాడు.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసీస్ తరపున అదరగొడుతున్నాడు. ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని గుజరాత్ యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్న గ్రీన్.. త్వరలోనే బౌలింగ్‌కు చేసేందుకు అందుబాటులో ఉండనున్నాడు.
గ్రీన్ ఇప్పటికే ఐపీఎల్‌లో రెండు సార్లు రూ. 17.50 కోట్లు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. గత రెండేళ్లలో టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువగా ఉంది. ఐపీఎల్ 2026 వేలంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్ ఉన్నాడు. గ్రీన్‌కు ఓ ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది.