100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో డ్రెసెల్‌ ప్రపంచ రికార్డు

Caleb Dressel Shatters World Record to Win 100m Butterfly Gold - Sakshi

పురుషుల స్విమ్మింగ్‌లో సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికన్‌ కాలెబ్‌ డ్రెసెల్‌ మరోసారి తన సత్తాను ప్రదర్శించాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌ను 49.45 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలువడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2019లో 49.50 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును డ్రెసెల్‌ తిరగరాయడం విశేషం.

మహిళల విభాగంలో క్యాథలీన్‌ లెడెకీ (అమెరికా) హవా కొనసాగింది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ఆమె స్వర్ణ పతకం (8 నిమిషాల 12.57 సెకన్లు) సాధించింది. టిట్మస్‌ (ఆస్ట్రేలియా)కు రజతం, సిమోనా క్వాడ్రెల్లా (ఇటలీ)కి కాంస్యం దక్కాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top