స్వతంత్ర భారతి 2011/2022: ఇండియాకు రెండో వరల్డ్ కప్

వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఎంఎస్ ధోని నాయకత్వంలో ఇండియన్ క్రికెట్ టీం శ్రీలంకపై విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముంబై నగరంలోని వాంఖడే స్టేడియంలో రసవత్తరంగా కొనసాగింది. 10 బంతులు మిగిలి ఉండగానే మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఎంఎస్ ధోని శ్రీలంక చేసిన 275 లక్ష్యాన్ని ఛేదించేందుకు అర్థ శతకం పరుగులు చేసి ఇండియాను విజయ తీరాల వైపు నడిపించాడు. 28 ఏళ్ల తర్వాత సాకారమైన ప్రపంచ కప్ కల భారత క్రికెట్ క్రీడాభిమానులను మాత్రమే కాదు, భారత క్రికెట్ జట్టునూ ఉర్రూతలూగించింది. తొలిసారి భారత్ 1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో వెస్ట్ ఇండీస్‌ను ఓడించి ప్రపంచ కప్‌ను కైవశం చేసుకుంది.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
ఇ.వి.వి. సత్యనారాయణ, భీమ్‌సేన్ జోషి, అనంత్‌పాయ్, అర్జున్‌సింగ్, నటి సుజాత, సత్య సాయిబాబా, ఎం.ఎఫ్.హుస్సేన్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, దేవ్ ఆనంద్, ఎస్. బంగారప్ప.. కన్నుమూత.
జనాభా లెక్కల్లో 18 కోట్ల మంది పెరుగుదల.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తొలిసారి మమతా బెనర్జీ.
లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.
మరిన్ని వార్తలు