Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌

Axar Patel Married To Meha Patel In Vadodara Pics Goes Viral - Sakshi

Axar Patel- Meha Patel Wedding: టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను వివాహమాడాడు. వడోదరలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మెహాతో ఏడడుగులు నడిచాడు. గురువారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా పెళ్లి నేపథ్యంలో సెలవు తీసుకున్న అక్షర్‌ పటేల్‌ న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు.

ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. మెహాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అక్షర్‌ పటేల్‌ గతేడాది తన పుట్టినరోజున ఆమె చేతివేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌ జరిగిన ఏడాది తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు మెహాను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కాగా మెహా న్యూట్రిషనిస్ట్‌, డైటీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరి పెళ్లికి అక్షర్‌ స్నేహితుడు, క్రికెటర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ కుటుంబంతో హాజరయ్యాడు.

ఇదిలా ఉంటే టీమిండియా మరో స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ జనవరి 23న బాలీవుడ్‌ నటి అతియా శెట్టిని పెళ్లాడిన విషయం తెలిసిందే. మూడు రోజుల(జనవరి 26) తర్వాత అక్షర్‌ కూడా ఈవిధంగా శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్‌ తమ అభిమాన క్రికెటర్‌కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: మైదానంలో ‘కింగ్‌’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!
KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్‌! రిసెప్షన్‌ ఎప్పుడంటే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top