రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన గ్లెన్ మాక్స్‌వెల్‌ | Australia's Glenn Maxwell Announces ODI Retirement | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన గ్లెన్ మాక్స్‌వెల్‌

Jun 2 2025 11:44 AM | Updated on Jun 2 2025 12:45 PM

Australia's Glenn Maxwell Announces ODI Retirement

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు మాక్స్‌వెల్‌ వీడ్కోలు పలికాడు.  ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌కు ఇ‍చ్చిన ఇంటర్వ్యూలో మాక్సీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకుని త‌న స్ధానంలో యువ ఆట‌గాళ్లకు అవకాశమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల మాక్స్‌వెల్ వెల్లడించాడు.

ఆసీస్ చీఫ్ సెల‌క్ట‌ర్ జార్జ్ బెయిలీతో చ‌ర్చించాకే 50 ఓవ‌ర్ల ఫార్మాట్ నుంచి త‌న త‌ప్పుకుంటున్న‌ట్లు ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్ తెలిపాడు. పదేపదే గాయాల బారిన పడడం కూడా మాక్సీ ఆకస్మిక రిటైర్మెంట్‌కు ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇక  ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీక‌రించింది.  2012లో ఆస్ట్రేలియా త‌ర‌పున అరంగేట్రం చేసిన మాక్స్‌వెల్‌.. త‌న 13 ఏళ్ల వ‌న్డే కెరీర్‌లో ఎన్నో అసాధారణ ఘ‌న‌త‌ల‌ను అందుకున్నాడు. 

ముఖ్యంగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2023లో అఫ్గానిస్తాన్‌పై మాక్సీ ఆడిన ఇన్నింగ్స్ స‌ద‌రు క్రికెట్ అభిమానికి ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఓ వైపు గాయంతో బాధ‌ప‌డుతూ ఒంటి కాలితో అఫ్గానిస్తాన్‌పై విరోచిత డ‌బుల్ సెంచ‌రీతో మాక్స్‌వెల్ చెల‌రేగాడు. ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి త‌న జ‌ట్టును సెమీఫైన‌ల్‌కు మాక్స్‌వెల్ చేర్చాడు. 

ఇక తన వన్డే కెరీర్ లో 149 వన్డేలు ఆడిన మాక్స్ వెల్..  4,000 పరుగులు సాధించాడు. అదేవిధంగా అత‌డు 77 వికెట్లు కూడా వ‌న్డేల్లో ప‌డ‌గొట్టాడు. 2015, 2019లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజయాలు సాధించడంలో గ్లెన్ మాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు. చివరగా ఆస్ట్రేలియా తరపున వన్డే మ్యాచ్‌ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాడు. కాగా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్న మాక్స్‌వెల్‌.. ఇకపై కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగే ఛాన్స్‌ ఉంది.

చదవండి: IPL 2025: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..


 

Advertisement
 
Advertisement
Advertisement