ఎదురులేని ఆసీస్‌ మహిళల స్విమ్మింగ్‌ జట్టు

Australia women open Tokyo Olympics account with third straight 4x100m gold - Sakshi

4 x100 మీటర్ల రిలేలో ప్రపంచ రికార్డు

టోక్యో: ఈత కొలనులో ఆస్ట్రేలియా మహిళల జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల 4x100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే రేసులో బ్రోంటి క్యాంప్‌బెల్, మెగ్‌ హ్యారిస్, ఎమ్మా మెకియోన్, కేట్‌ క్యాంప్‌బెల్‌లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఆసీస్‌ జట్టు 3 నిమిషాల 29.69 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో 3ని:30.05 సెకన్లలో ఆస్ట్రేలియా జట్టే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top