ఫ్రీబాల్‌కు పట్టుబడుతున్న అశ్విన్‌!

Ashwin Wants Free Ball For Bowlers As He Calls For Equal Contest - Sakshi

దుబాయ్‌: క్రికెట్‌లో ఫ్రీబాల్‌ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పట్టుబడుతున్నాడు. బౌలర్‌ నో బాల్‌ వేసినప్పుడు బ్యాట్స్‌మన్‌కు ఎలా ఫ్రీహిట్‌ ఉంటుందో అలానే నాన్‌ స్టైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ బంతిని వేయకముందే క్రీజ్‌ను దాటి ముందుకు వెళితే ఫ్రీబాల్‌ నిబంధనను తేవాలంటున్నాడు. అదే సమయంలో ఫ్రీబాల్‌లో బ్యాట్స్‌మన్‌ ఔటైతే బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులు కోత విధించాలని అంటున్నాడు. ఫ్రీబాల్‌లో బ్యాట్‌మన్‌ పరుగు చేసినా లెక్కించకూడదని తెలిపాడు.  ఇలా చేస్తే సమ న్యాయంగా ఉంటుందన్నాడు. (చదవండి: ‘వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌’ వచ్చేసింది...)

వచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌ కోసం నిర్వహించే సూపర్‌ లీగ్​లో ఫ్రంట్ ఫుట్​ నోబాల్​ నిర్ణయాన్ని టీవీ అంపైర్​కు ఐసీసీ అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవిచంద్రన్ అశ్విన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చాడు. 'ఒకవేళ బౌలర్ బంతి వేసే ముందే నాన్​స్ట్రయికర్​ క్రీజు దాటితే.. టెక్నాలజీ గమనించి పరుగులను అనుమతించని పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. ఇది ఫ్రీబాల్‌ కావాలి. బ్యాట్స్‌మన్‌ పరుగులు చేసినా ఉండకూడదు. ఒకవేళ ఫ్రీబాల్‌లో బ్యాట్స్‌మన్‌ ఔటైతే బ్యాటింగ్‌ జట్టుకు  ఐదు పరుగులు తగ్గించండి .బ్యాట్స్​మన్ ఇలా చేసిన ప్రతీసారి ఇదే రూల్ ఫాలో కావాలి' అని అశ్విన్ పేర్కొన్నాడు. దీనిపై గతంలోనే వరుస ట్వీట​ చేసిన అశ్విన్‌.. తాజా మరోసారి దాన్ని గుర్తు చేశాడు.  ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న అశ్విన్‌.. మన్కడింగ్‌పై కోచ్‌ రికీ పాంటింగ్‌తో మాట్లాడిన తర్వాతే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు  బట్లర్‌ను మన్కడింగ్ చేయగా కొందరు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్రీబాల్‌ నిబంధనను అమలు చేయాలంటున్నాడు. ఇలా చేస్తే బ్యాట్స్‌మన్‌కు, బౌలర్‌కు సమతూకంగా ఉంటుందన్నాడు. బౌలర్‌ బంతిని వేయకుండా క్రీజ్‌ను దాటి వెళ్లిపోతే పరుగుకు అదనంగా మరో పరుగు వచ్చే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించాడు. అటు సమయంలో న్యాయ బద్ధంగా ఉన్న మన్కడింగ్‌ను వ్యతిరేకించడం కూడా భావ్యం కాదన్నాడు. ఒకవేళ మన్కడింగ్‌ సరైనది కాదని భావిస్తే ఫ్రీబాల్‌ నిబంధనను పెడితే నాన్‌స్టైకర్‌ అనేవాడు కాస్త జాగ్రత్తగా ఉంటాడనేది అశ్విన్‌ వాదన. ఏది ఏమైనా అశ్విన్‌ ప్రతిపాదించిన ఫ్రీబాల్‌ నిబంధనను కాస్త బాగానే కనిపిస్తున్నా దానిపై క్రికెట్‌ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారో లేదో చూడాలి. (చదవండి:‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్‌ చేజార్చుకున్నాం’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top