
మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రైజింగ్ స్టార్ షఫాలీ వర్మ తన సహానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాటర్ బెత్ మూనీపై కోపంతో షఫాలీ ఊగిపోయింది.
ఏం జరిగిందంటే?
ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రాధా యాదవ్ బౌలింగ్‌లో.. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెత్ మూనీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫాలీ వర్మ జారవిడిచింది. అనంతరం 12 ఓవర్‌లో శిఖాపాండే బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా మూనీ షాట్ ఆడింది. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షఫాలీ ఎటువంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకుంది.
ఈ క్రమంలో షాఫాలీ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. మూనీ వైపు వేలు చూపిస్తూ వెళ్లిపో అంటూ గట్టిగా అరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో షఫాలీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది.
చదవండి: PSL 2023: పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్
Aggression of Shafali Verma. #INDWvsAUSW #ShafaliVerma pic.twitter.com/msTWcMrAx5
— Naveen Sharma (@iamnaveenn100) February 23, 2023