ఐపీఎల్‌ ఫైనల్‌ పోయింది | Ahmedabad, not Bengaluru to host IPL 2026 final | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫైనల్‌ పోయింది

May 7 2026 8:18 AM | Updated on May 7 2026 8:18 AM

Ahmedabad, not Bengaluru to host IPL 2026 final

బెంగళూరు నుంచి గుజరాత్‌కు షిఫ్ట్‌

బెంగళూరు: అనుకున్నట్లుగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్‌ ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ మరోచోటుకు మారింది. గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించడంతో బెంగళూరు క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 31న మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్లు, చిన్న స్టేడియం కావడం తదితర కారణాలతో మార్చేసినట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. ఇటీవల చిన్నస్వామిలో భద్రతా సమస్యలు తలెత్తాయి. గతంలో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. ఇటీవల ఆర్‌సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ సమయంలో సుమారు 240 కెమెరాలను పనిచేయలేదు.

ఎమ్మెల్యేల టికెట్లకు లింకు లేదు: డీసీఎం
అహ్మదాబాద్‌లో పెద్ద స్టేడియం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అక్కడికి మార్చి ఉండవచ్చు అని  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు.  ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్ల పంపిణీకి, మ్యాచ్‌ మార్పునకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీసీసీఐ పెద్దలు అలాగే మాట్లాడనీ, సరైన సమాధానం ఇస్తానన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement