టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన ఆడమ్‌ జంపా... | Sakshi
Sakshi News home page

AUS Vs BAN: టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన ఆడమ్‌ జంపా...

Published Thu, Nov 4 2021 8:16 PM

Adam zampa Creates Record In T20 World Cup - Sakshi

Adam zampa Creates Record In T20 World Cup: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా అరుదైన రికార్డును సాధించాడు. ఆస్ట్రేలియా తరుపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. టి20 ప్రపంచకప్‌-2021 సూపర్‌ 12లో భాగంగా నవంబర్‌4న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు ఇచ్చి  5 వికెట్లు సాధించి ఈ ఘనత అందుకున్నాడు.

అంతకముందు 2016 టి20 ప్రపంచకప్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్ పాకిస్తాన్‌పై 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో  బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

చదవండి: టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాము: స్కాట్లాండ్ కెప్టెన్

Advertisement
 
Advertisement
 
Advertisement