6 Wickets In A Over: క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు

6 Wickets In A Over: Dubai Teenager Harshit Seth Achieves Double Hat Trick In A Over - Sakshi

దుబాయ్‌: క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన కర్వాన్‌ అండర్‌-19 గ్లోబల్‌ లీగ్‌ టీ20 టోర్నీలో భారత సంతతి(ఢిల్లీ)కి చెందిన స్థానిక కుర్రాడు హర్షిత్‌ సేథ్‌ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన హైదరాబాద్‌ హాక్స్‌ అకాడమీ ఆర్సీజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ స్టార్లెట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హర్షిత్‌.. డబుల్‌ హ్యాట్రిక్‌ సహా మొత్తం 8 వికెట్లు(4-0-4-8) సాధించడంతో పర్యాటక జట్టు 44 పరుగులకే కుప్పకూలింది. 

ప్రస్తుత క్రికెట్‌లో దాదాపుగా అసాధ్యమైన డబుల్‌ ఈ హ్యాట్రిక్‌ ఫీట్‌ను లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ హర్షిత్‌ సాధించాడు. ఈ ఏడాది నవంబర్‌ 28న జరిగిన ఈ ఘట్టం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘట్టం ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు. అయితే, 2017 జనవరిలో ఆస్ట్రేలియా క్లబ్‌ క్రికెట్‌లో ఇలాంటి ఘట్టమే ఆవిష్కృతమైంది. గోల్డన్‌ పాయింట్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున అలెడ్‌ క్యారీ​ డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందు 1930లో భారత స్కూల్‌ క్రికెట్‌లో వైఎస్‌ రామస్వామి, 1951లో ఇంగ్లండ్‌ లోకల్‌ క్రికెట్‌లో జి సిరెట్‌ ఈ రికార్డును సాధించినట్లు తెలుస్తోంది.  
చదవండి: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి..
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top