వెంటిలేటర్‌పై ఉన్నా నీ పాడు బుద్ధి వదులుకోలేవా.. | Viral Video: Man On A Ventilator With Oxygen Mask On Makes Khaini | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌పై ఉన్నా నీ పాడు బుద్ధి వదులుకోలేవా.. నెటిజన్లు ఫైర్‌!

Apr 23 2021 3:57 PM | Updated on Apr 24 2021 7:55 AM

Viral Video: Man On A Ventilator With Oxygen Mask On Makes Khaini - Sakshi

సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏది కూడ తినే పరిస్థితి ఉండదు. ఏది కూడా తినాలనిపించదు. అయితే, ఈ వీడియోలోని సదరు వ్యక్తి మాత్రం ఐసీయూలో  వెంటిలేటర్‌పై ఉండికూడా తన చెడు వ్యసనాన్ని వదులుకోలేక పోయాడు. ఇతడు చేసిన సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతడు గాలి కూడా  పీల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు.

అతని శరీరానికి అన్ని పైపులే ఉన్నాయి. కాగా, ఒక నర్సు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితిని చూస్తొంది. మరోక వ్యక్తి అతని పాదాల వద్ద ఉండి అతడిని గమనిస్తుంది. ఆ సదరు వ్యక్తి మాత్రం తీరిగ్గా.. తన చేతుల్లో ఖైనీ ( తంబాకు) తీసుకొని,  చేతిలో వేసుకొని రుద్దుతు తంబాకు తయారు చేయడం చేస్తున్నాడు. ఈ వీడియో.. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. ప్రాణాలు పోతున్నా,  చెడు వ్యసనం మాత్రం వదులుకోలేకున్నాడు’ అంటూ ఘాటుగా కామెంట్‌లు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement