వైరల్‌: నవ్వులు పూయిస్తున్న మహిళ వీడియో

Sukriti Talwar Hilarious Video Viral On Social Media  - Sakshi

ఇంట్లో పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటే తల‍్లులు వారికి అన్నం తినిపించేందుకు నిన్ను పిచ్చోడికి పట్టిస్తా. డాక్టర్‌ను పిలుస్తా.. వచ్చి ఇంజక్షన్‌ వేస్తాడంటూ భయపెడ‍్తుంటారు. ఆ భయంతోనైనా పిల‍్లలు చెప్పిన మాట వింటారని వారి ఆశ. అయితే, కొంతమంది అల్లరి గడుగ్గాయిలు మాత్రం భయపడితే, మరింతగా రెచ్చిపోయి ఇల్లు పీకి పందిరి వేస్తుంటారు. ఇక ఇలాంటి వారిని జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తే పిల్లలకు ఇంజక్షన్‌ ఇచ్చేందుకు డాక్టర‍్లు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. ఆ మధ్య ఓ డాక్టర్‌ పిల్లాడికి ఇంజక్షన్‌ ఇస్తుంటే  సార్‌ మీరు చాలా మంచోళ్లు. నన్ను వదిలేయండి సార్‌ వెళ్లిపోతా అంటూ క్యూట్‌ గా మాట్లాడిన మాటలు నెటిజన్లను నవ్వులు పూయించాయి. 

ఇలా పిల్లలే కాదండయో డాక్టర్లు ఇచ్చే ఇంజక్షన్‌ అంటే పెద్దోళ్లకు భయమే. దేశంలో 18 ఏళ్ల నుంచి 45 మధ్య వయస్సున్న వారికి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ క‍్రమంలో ఢిల్లీకి చెందిన సుకృతి తల్వార్‌ అనే మహిళ వ‍్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఓ ఆస్పత్రికి వచ్చింది. వ్యాక్సిన్‌ వేసే క్రమంలో ఆమె చేసిన హడావిడి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇంజక్షన్‌ ఇస్తుంటే వద్దని వారిస్తూ మమ్మీ అంటూ కేకలు వేసింది. ఆ కేకలతో  డాక్టర్‌ సైలెంట్‌  అవ్వడంతో పక‍్కనే ఉన్న యువతి కుటుంబ సభ్యుడు ఆమె నోరు తెరవకుండా చేయి అడ్డం పెట్టి, ఆమెను గట్టిగా పట్టుకోవడంతో వ్యాక‍్సిన్‌ ఇచ్చేశాడు. అమ్మో భయంకరమైన అనుభవం అంటూ సదరు మహిళ షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చేసేయండి.   

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top