టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాధికారి వరుగంటి శాస్త్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 11వరకు జరిగిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 332 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. ఇందులో 210 మంది బాలురు, 122 మంది బాలికలు ఉన్నారన్నారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.

కొనసాగుతున్న

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌

నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్‌ ప్రవేశం కోసం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. గురువారం 176 మంది విద్యార్థులు హాజరయ్యారు. ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు విద్యార్థులకు లాగిన్‌ ఐడీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ ఈనెల 26 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

ఉపాధ్యాయుల

‘సర్దుబాటు’ను సవరించాలి

డీఈఓకు యూటీఎఫ్‌ కమిటీ వినతి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం డీఈఓ వరుగంటి శాస్త్రిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌వలీ, యాదగిరి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అమలుకు విద్యార్థుల నమోదు సంఖ్యను జూలై 31వరకు తీసుకోవాలన్నారు. రెండేళ్లుగా కొనసాగిస్తున్న విధానాన్ని ఈ ఏడాది కూడా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌(ఏఎంఓ) పోస్టును సీనియర్‌ గెజిటెడ్‌ హెచ్‌ఎం లేదా సీనియర్‌ ఎస్‌ఏతో భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటకిరణ్‌, జిల్లా కమిటీ సభ్యులు గిరిబాబు, నర్సింలు, రాజేందర్‌, రాజనర్సింలు, బాలకిషన్‌, లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

‘హ్యూమన్‌ రైట్స్‌’

జిల్లా అధ్యక్షుడిగా భీమప్ప

గజ్వేల్‌: ఆర్‌టీఐ హ్యూమన్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడకు చెందిన భీమప్ప నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌గుప్త నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భీమప్ప మాట్లాడుతూ అసోసియేషన్‌ ఆశయాలకనుగుణంగా పనిచేస్తానని అన్నారు.

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయండి

సిద్దిపేటరూరల్‌: ఆశాసీ్త్రయమైన నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురు వారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసి సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 27వేల పాఠశాలలను 4వేల పాఠశాలలకు కుదిస్తామని సీఎం చెప్పడం సరికాదన్నారు. గ్రామం సమగ్రాభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ పాఠశాల తప్పనిసరి అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్‌వలిఅహ్మద్‌, ప్రధాన కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement