నాచ‘గిరి’ ప్రదక్షిణం.. పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

నాచ‘గిరి’ ప్రదక్షిణం.. పోటెత్తిన భక్తజనం

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

స్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి అలరారింది. క్షేత్రంలో నృసింహ నామం మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి గురువారం ఉదయం ఉత్తర ద్వారం వద్ద నృసింహునికి హారతి సమర్పించి ‘గిరి’ ప్రదక్షిణ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ చైర్మన్‌ రవీందర్‌ గుప్తా, ఈఓ రంగాచారి, ధర్మకర్తలు, వేలాది భక్తులు స్వామివారిని అనుసరిస్తూ, నృసింహుని స్మరిస్తూ నాచగిరి కొండలు, హరిద్రానది తీరం చుడుతూ ఉత్తరద్వారం వద్దకు చేరుకున్నారు. గర్భగుడిలో లక్ష్మీనృసింహులను దర్శించుకున్నారు. క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

– వర్గల్‌(గజ్వేల్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement