సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచామని, అదే స్థాయిలో సర్ ప్రక్రియలోనూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావా లని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో సర్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్‌లో ఇప్పటివరకు మ్యాపింగ్ జరిగిందని, ప్రస్తుతం ఇంటింటికీ సిబ్బంది వస్తున్నారని, వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలకు సర్‌పై అవగాహన కల్పించి పాల్గొనేలా చూడాలన్నారు. ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేస్తూ.. అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఎన్యూమరేషన్ పత్రాలను నింపే సమయంలో సహకరించాలని సూచించారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడాలి..
నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. మంజూరు కానీ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. బిల్లులు సైతం వెంటనే చెల్లించాలన్నారు. హరితహారంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి లక్ష మొక్కలు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికి 70వేల మొక్కలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పంచాయతీ సెక్రటరీ పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలన్నారు.
మృతుల కుటుంబాల పరామర్శ
సిద్దిపేటఅర్బన్: మండలంలోని పొన్నాల గ్రామంలో ఇటీవల మృతి చెందిన పలువురు మృతుల కుటుంబ సభ్యులను గురువారం రాత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. పొన్నాల మాజీ సర్పంచ్ దుర్గయ్య కూతురు మృతి చెందగా పరామర్శించి ఓదార్చారు.
‘సర్’పై ప్రజలకు అవగాహన కల్పిద్దాం
బూత్ లెవల్ ఏజెంట్లుఅప్రమత్తంగా ఉండాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు


