సర్‌కు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌కు సహకరించాలి

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

కొండపాక(గజ్వేల్‌): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు వచ్చే బీఎల్‌ఓలకు సహకరించుకుంటూ ఓటు హక్కును పక్కాగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్‌ హైమావతి అన్నారు. కొండపాక మండలం దుద్దెడలో సర్వే ప్రక్రియను గురువారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ అర్హులైన వారు ఓటు హక్కును కోల్పోకుండా చూడటంతో పాటుగా నకిలీ ఓటరులను జాబితాలోంచి తొలగించేందుకు సర్వేను చేపట్టిందన్నారు. సర్వేలో భాగంగా ప్రతీ ఇంటికీ ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేస్తారని, వివరాలు సేకరిస్తారన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును కోల్పోకుండా బీఎల్‌ఓలు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మల్లికార్జున్‌రెడ్డి, బీఎల్‌ఓ, బీఎల్‌ఏలు, సర్పంచ్‌ శివకుమార్‌, నాయకులు గోనె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కును పక్కాగానమోదు చేయించుకోవాలి

కలెక్టర్‌ హైమావతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement