వర్గల్(గజ్వేల్): జాగ్రత్తలు, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందింపజేసేందుకు కావేరి విశ్వవిద్యాలయంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం సబ్‌ఇన్‌స్పెక్టర్ మదన్‌గౌడ్, ఇజ్రాయిల్‌కు చెందిన భద్రతా నిపుణుడు, ట్రెయినింగ్ మేనేజర్ యెహియెల్ షాలోమ్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆత్మరక్షణ పద్ధతులు, అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ భద్రత అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కావేరి వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ నైపుణ్యాలు, భద్రతాపద్ధతులపై అవగాహన ఎంతో అవసరమన్నారు.


